పవన్ కళ్యాణ్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉంది.. తులసిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

|

Mar 15, 2022 | 4:27 PM

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి (Tulasi Reddy) అన్నారు. పవన్ డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహం అని....

పవన్ కళ్యాణ్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉంది.. తులసిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
Tulasi Reddy
Follow us on

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి (Tulasi Reddy) అన్నారు. పవన్ డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహం అని మండిపడ్డారు. రాష్ట్రానికి నెంబర్ ఓన్ ద్రోహి బీజేపీ(BJP) అన్న ఆయన.. సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని అదే సభా ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు. స్వశక్తి రాజకీయాలు చేయ లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఎద్దేవా చేశారు. భాజపా చేతిలో పవన్ కల్యాణ్​ కీలుబొమ్మ అని తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి శనిగ్రహం, నెంబర్​వన్​ ద్రోహి బీజేపీ అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీజేపీ అని తులసి రెడ్డి ధ్వజమెత్తారు.

భాజపా ఇచ్చే రోడ్​మ్యాప్​తో ముందుకుపోతానని పవన్ కల్యాణ్​ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సభావేదిక మీదుగా అధికార వైకాపా తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిప్పులు కురిపించారు. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాను గద్దె దించి తీరుతామన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్. జనసైనికులపై వైకాపా చేసే దాడులకు వెన్ను చూపేది లేదన్న పవన్.. వైకాపా మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం భాజపా నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తానన్నారని, దానికోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు పవన్‌.

వైకాపా వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదన్న జనసేనాని.. ప్రజా ప్రయోజనాల కోసం పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించిన అధినేత పవన్ సుదీర్ఘంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు, అన్ని వర్గాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేశారు. తమ పార్టీ నేతలు శ్రేణులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చివరకు తన సంస్కారం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా నేతలకూ నమస్కారాలు తెలియజేశారు పవన్.

ఇవీ చదవండి.

Pooja Hegde: జాతకాలు.. విధిరాతల పై బుట్టబొమ్మ పూజాహెగ్డే ఏమన్నదంటే..

Crime news: గుప్త నిధుల కోసం మేనల్లుడి నరబలి.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు