కృష్ణా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్న‌ నేత‌లు

కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల మధ్య శ‌నివారం ఘర్షణ చోటు చేసుకుంది. కేసరపల్లిలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వల్లభనేని...

కృష్ణా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్న‌ నేత‌లు

Updated on: Dec 19, 2020 | 12:46 PM

కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల మధ్య శ‌నివారం ఘర్షణ చోటు చేసుకుంది. కేసరపల్లిలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వల్లభనేని వంశీ కార్యక్రమంలో పరస్పర దాడులు చేసుకున్నారు. వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేతలకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన కార‌ణాల‌ను అధికారులు, నేత‌లు ఆరా తీస్తున్నారు. ఓ వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ఇరువ‌ర్గాల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరు వ‌ర్గాల్లో త‌లెత్తుతున్న విబేధాల కార‌ణంగానే ఈ ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసిన‌ట్లు తెలుస్తోంది. ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొని ఒక‌రిపై ఒక‌రు రాళ్ల‌తో దాడి చేసుకోవ‌డంతో అక్కడున్న పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌కు త‌లెత్తిన అంశంపై ప‌లువురిని విచారిస్తున్నారు పోలీసులు.