సంక్రాంతి అంటే.. బోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. అసలు సిసలు మజా.. కోడి పందాలే. అసలు సంక్రాంతి పండుగ అనగానే.. కోళ్ల పందేలే ముఖ్యంగా గుర్తొస్తాయి. కోడిపందేలే సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అవి లేకుండా పండగేంటండీ అంటూంటారు అంటే.. వాటికున్న డిమాండ్‌నే వేరు. కాగా.. ఈ పందేలకు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని చూడటం కోసం.. పండుగ మూడురోజులూ ఏపీకి వాలిపోతూంటారు జనాలు. ఈ పందేల కోసమే.. వేలకు వేలు పెట్టి కోళ్లను పెంచుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి పండుగ సెలెబ్రేషన్స్ జోరందుకున్నాయి. దీంతో.. కోళ్ల పందేలకు అన్నిరకాలుగా ముస్తాబులు చేస్తున్నారు నిర్వాహకులు.
అయితే.. 2019 ఏడాదిలో.. ఏకంగా ఫుల్ ఎల్‌ఈడీ స్క్రీన్స్ పెట్టి మరీ వీటిని హైలైట్ చేశారు. అంతేకాదండోయ్.. వీటిని వెళ్లి ఫ్రీగా చూడొచ్చు అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పందేలు చూడాలంటే టికెట్స్ కూడా తీసుకోవాలి. కాగా.. సాధారణ పందేం కోళ్ల ధర రూ.10 వేల నుంచి మొదలవుతుంది. ఒకప్పుడు ఈ కోళ్ల పందాలను ఆచారం ప్రకారం నిర్వహించేవారు. కానీ.. ఇప్పుడు ఇది ఓ పెద్ద దందా మారిపోయింది. కాగా.. వీటికి చెక్ పెట్టేందుకు.. పోలీసులు కూడా పగడ్భందీగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు కూడా చేపట్టారు.