AP Rains: పిడుగులతో కూడిన వర్షాలు.. ఏపీలోని ఈ జిల్లాలకు ముఖ్య అలెర్ట్..

|

May 31, 2023 | 7:35 AM

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఒక్కసారిగా..

AP Rains: పిడుగులతో కూడిన వర్షాలు.. ఏపీలోని ఈ జిల్లాలకు ముఖ్య అలెర్ట్..
Andhra Weather Update
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అనకాపల్లి, కృష్ణ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.

మరోవైపు మంగళవారం ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసాయి. అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలులు, పిడుగులు పడ్డాయి. రాజోలు మండలం తాటిపాకలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా.. ఏలూరు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో  వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వల్ల వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.