YS Jagan: మేమంతా సిద్ధం.. సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభం

రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధమన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన వైసీపీ అధినేత.. మేమంతా సిద్ధం అంటూ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పెంచికలపాడు వరకు యాత్ర జరగనుండగా.. నంద్యాలలో సభ నిర్వహించనున్నారు.

YS Jagan: మేమంతా సిద్ధం.. సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభం
Ys Jagan

Updated on: Mar 28, 2024 | 10:57 AM

రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధమన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన వైసీపీ అధినేత.. మేమంతా సిద్ధం అంటూ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పెంచికలపాడు వరకు యాత్ర జరగనుండగా.. నంద్యాలలో సభ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర రెండు రోజు ప్రారంభమైంది. ఈ యాత్రంలో భాగంగా నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామస్థులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు సీఎం జగన్. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్..

లైవ్ వీడియో చూడండి..

బస్సు యాత్ర ఇలా..

అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్లు, నన్నూర్,పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో నైట్ క్యాంప్ శిబిరం దగ్గరకు చేరుకుని బస చేస్తారు.

అన్ని పార్టీలు కలిసి తన చెల్లెలను తనపై పోటీకి ఉసిగొల్పుతున్నాయని నిన్నటి ప్రొద్దుటూరు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్. నిన్నటి ప్రొద్దుటూరు సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..