YS Jagan: ఎంవోయూల అమలుకు చర్యలు తీసుకోండి.. మంత్రులకు సీఎం జగన్ సూచనలు..

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ చేసిన మంత్రులను ప్రశంసించారు సీఎం జగన్. ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ముఖ్యమంత్రి.

YS Jagan: ఎంవోయూల అమలుకు చర్యలు తీసుకోండి.. మంత్రులకు సీఎం జగన్ సూచనలు..
Ys Jagan

Updated on: Mar 08, 2023 | 9:49 AM

విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సూపర్ సక్సెస్ అయిందంటూ సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ ను.. ఆయాశాఖల మంత్రులు, అధికారులు మంగళవారం కలిశారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు బహుమతిని అందజేశారు మంత్రులు.

ఈనెల 3,4 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతమైంది. రెండు రోజుల్లో 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. దీంతో ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్‌. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్.. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us