Vijayawada: ‘తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం’ పేరును మార్చారా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్..

|

Feb 14, 2023 | 6:37 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరంలో విజయవాడలో ఉన్న చారిత్రక తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం.. దశాబ్దాలుగా ఎన్నో సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలకు వేదికైన విషయం అందరికీ తెలిసిందే.

Vijayawada: ‘తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం’ పేరును మార్చారా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్..
Tummalapalli Kalakshetram
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరంలో విజయవాడలో ఉన్న చారిత్రక తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం.. దశాబ్దాలుగా ఎన్నో సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలకు వేదికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం పేరును ఏపీలోని జగన్ ప్రభుత్వం ‘కళాక్షేత్రం’గా మార్చిందంటూ పలు వార్త పత్రికల్లో, టీవీల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే, తుమ్మలపల్లి వారి పేరును సైతం ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు తరహాలోనే మార్చినట్లు ప్రచారం గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం పేరు మార్పుపై విజయవాడ నగర పాలక సంస్ధతో పాటు ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడంతోపాటు ఏపీ ఫ్యాక్ట్ చెక్ లో కూడా పలు వివరాలను షేర్ చేసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్పు ప్రచారం అబద్దమంటూ కొట్టిపారేసింది.

తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’’ పేరును తొలగించి, దాన్ని ‘‘కళాక్షేత్రం’’గా మార్చారంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రస్తుతం ఆ బోర్డు తయారీలో ఉంది. త్వరలో దాన్ని ఆ భవనంపై ఏర్పాటుచేస్తాం. అంతేగానీ, పేరు మార్చలేదు.. అంటూ విజయవాడ నగరపాలక సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

2016లో కృష్ణా పుష్కరాల సమయంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం భవనాన్ని పునరుద్ధరించారు. ఎలివేషన్‌ భాగాన్ని పునరుద్ధరించే క్రమంలో ‘‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’’ బోర్డు తొలగించారు. పనులు పూర్తయ్యాక ఆ బోర్డును యథాస్థానంలో పెట్టలేదు. అని పేర్కొంది.

2021 డిసెంబరులో కూడా ఈ భవనానికి కొన్ని మరమ్మతులు చేపట్టాం. ఈ భవనం కేవలం సాంస్కృతిక కార్యక్రమాల కోసమే నిర్దేశించింది అనే ఉద్దేశాన్ని హైలైట్‌ చేయడానికి ‘‘కళాక్షేత్రం’’ అనే పేరు ఎలివేషన్‌ భాగంపైన గ్లో సైన్‌ బోర్డు పెట్టాం. అంతేగానీ, పేరు మార్చే ఉద్దేశమేదీ లేదు. అని స్పష్టంచేసింది.

అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దంటూ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..