చిత్తూరు జిల్లా, ఆగస్టు 28: జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా.. బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. ఈ ఏడాదికి సంబంధించిన నగదును చిత్తూరు జిల్లా నగరిలో విడుదల చేస్తోంది ప్రభుత్వం.
ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్ ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యాదీవెన స్కీంలో భాగంగా పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది జగన్ ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చదువుకుంటున్న విద్యార్థుల కళాశాల ఫీజుల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం భరిస్తోంది.
ఇవాళ చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన పథకంలో నుంచి లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ చేయనున్నారు సీఎం జగన్. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. సీఎం జగన్ నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు.
వై నాట్ 175.. ఇదీ.. కొన్నాళ్లుగా వైసీపీ నినాదం.. ఇదే.. ఎన్నికల టార్గెట్ అంటూ నంబర్ ఫిక్స్ చేశారు సీఎం జగన్. దానిలో భాగంగానే.. ప్రతీ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి.. ఎప్పటికప్పుడు అందుతున్న నివేదికలతో అలర్ట్ అవుతున్నారు. దాంతోపాటు.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మరింత స్పీడప్ చేశారు. జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనల్లో వేగం పెంచారు సీఎం జగన్.అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా నగరిలో పర్యటన కావడంతో మరింత ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం