CM Jagan visit : విజయనగరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. డిసెంబర్ 30న పర్యటన.. ఇళ్ల స్థలాల పంపిణీ…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 30న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

CM Jagan visit : విజయనగరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. డిసెంబర్ 30న పర్యటన.. ఇళ్ల స్థలాల పంపిణీ...

Edited By:

Updated on: Dec 23, 2020 | 1:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 30న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రం‌లోనే పెద్ద లే అవుట్‌కు చెందిన ఇళ్ల పట్టాల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గుంకలాం లే అవుట్ లో సీఎం సభ ఏర్పాట్లను సైతం మంత్రి పరిశీలించారు. కాగా, ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవలే చేపట్టింది.