
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడా వెనుకంజ వేయడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానం అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పక్కాగా అమలుచేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ 98 శాతం హామీలు నెరవేర్చామంటుంది. నవరత్నాలతో పాటు ఇతర హామీలు కూడా నెరవేర్చినట్లు చెబుతుంది. ఇక రైతుల విషయంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం ప్రతియేటా పెట్టుబడి సాయం అందిస్తుంది. రైతులకు పెట్టుబడిన సాయం అందించడంతో పాటు పంటనష్టపోయిన రైతులకు పరిహారం, ఏ యేడాది పంటనష్టాన్ని అదే ఏడాదిలో ఇవ్వడం వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఇప్పటికే వరుసగా నాలుగేళ్ల నుంచి రైతు భరోసా అమలుచేస్తున్న వైఎస్సార్సీపీ చివరి ఏడాది రెండో విడత నిధుల విడుదలకు సిద్దమైంది. రబీ సాగు పెట్టుబడి కోసం రైతులకు నిధులు అందించనుంది.
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సాయం అందిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్న సీఎం జగన్.. అక్కడ జరిగే బహిరంగ సభలో రైతు భరోసా రెండో విడత నిధులను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 52.57 లక్షల మంది రైతులకు 7500 చొప్పున 3వేల942.95 కోట్లను అందించింది. రెండో విడత పెట్టుబడి సాయం కోసం ఒక్కో రైతుకు 4 వేల కోట్లు విడుదల చేయనుంది.మొత్తం 53.53 లక్షల మంది రైతుకు 2204.77 కోట్ట నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ప్రతి యేటా మూడు విడతల్లో మొత్తం 13,500 రూపాయిలు చొప్పున ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం. మొదటి విడతలో 7,500.. రెండో విడతలో 4వేలు, మూడో విడతలో 2వేలు సాయం అందిస్తుంది. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాల ఆధారంగా అర్హుత ఉన్న భూ యాజమానులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగుచేసే వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తుంది. మొత్తం నాలుగున్నరేళ్లలో రేపు విడుదల చేస్తున్న నిధులతో కలిసి ఇప్పటి వరకూ సగటున 53.53 లక్షల మంది రైతులకు 33 వేల 209 కోట్లు పెట్టుబడి సాయం అందించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..