Andhra Pradesh: 9 మందితో ఫోర్త్ లిస్ట్.. ఆ ఎమ్మెల్యేలకు నో టికెట్.. వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ దూకుడుతో మందుకెళ్తోంది. మార్పులు చేర్పులు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు గ్రాఫ్ సరిగా లేని సిటింగ్‌లను పక్కన పెడుతున్న సీఎం జగన్.. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ దూకుడుతో మందుకెళ్తోంది. మార్పులు చేర్పులు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు గ్రాఫ్ సరిగా లేని సిటింగ్‌లను పక్కన పెడుతున్న సీఎం జగన్.. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతున్నారు. సర్వే అంచనాలను దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 11మంది లిస్ట్, 27మందితో సెకండ్ లిస్ట్, 21 మందితో మూడో జాబితాను విడుదల చేశారు. ఇలా మొత్తం మూడుజాబితాల్లో 59 మందిని మార్చారు. వీటిల్లో అసెంబ్లీతోపాటు.. పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో నాలుగో జాబితా కూడా రెడీ అవుతోంది. 8 నుంచి 9 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలో గురువారం కూడా పలువురు ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆపీసు నుంచి పిలుపు వచ్చింది. వారితో భేటీ అనంతరం సీఎం జగన్ నాలుగో జాబితా రెడీ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులపై కాసేపట్లో జాబితా విడుదల చేయనున్నారు. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంఓలో ధనుంజయరెడ్డి, సజ్జలతో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే, ఇప్పుడు విడుదలయ్యేు లిస్టులో ఎవరి పేరు ఉంటుందో.. ఎవరి పేరు మిస్ అవతుందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..