ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో జగనన్న వసతి దీవెన ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాష్ట్రంలోని 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.దాదాపు రూ.912.71 కోట్లను విద్యార్థుల తల్లులకు ఇవ్వనుంది. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్‌నొక్కి ఈ నగదు మొత్తాన్ని విడుదల చేయనున్నారు. అయితే బుధవారం జమ చేయనున్న రూ.912.71 కోట్లతో కలిపి ఇప్పటిదాకా రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విద్యార్థుల విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సీఎం జగన్ ఇప్పటి వరకు సుమారు రూ.58,555,07కోట్లు ఖర్చు చేశారు. 2017నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1778 కోట్లు కూడా వైసీపీ సర్కార్ చెల్లించింది. కేవలం సరిపడ నిధుల్లేకే ఈ వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేసినట్లు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖ సూచనల మేరకే వసతి దీవెనను వాయిదా వేశామన్నారు. సంక్షేమ పథకాల అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.