CM jagan: ఏపీలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. నేరుగా ఖాతాల్లోకి నగదు జమ

AP news: తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

CM jagan: ఏపీలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. నేరుగా ఖాతాల్లోకి నగదు జమ
Cm Jagan

Updated on: May 05, 2022 | 1:45 PM

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన పథకంతో విద్యార్థుల చదువుల విషయంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పేదరికం నుంచి బయటపడే శక్తి చదువుకు ఉందని సీఎం అన్నారు. తిరుపతిలో జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. 709 కోట్ల రూపాయలను 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.  జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద గడిచిన రెండేళ్ల కాలంలో 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల చదువులపై చేస్తున్న ఖర్చు పెట్టుబడి మాత్రమేనని తెలిపారు. పిల్లలు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దని టీడీపీ అంటోందని సీఎం అన్నారు.

ప్రశ్నపత్రాలు లీకేజీ వెనుక ఉన్నది నారాయణ స్కూల్స్‌, చైతన్య స్కూల్స్‌ అని సీఎం జగన్ అన్నారు. ఒక వ్యవస్థను నాశనం చేసే కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నారాయణ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనల వెనుక ఉన్నది టీడీపీ నాయకులేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాలపై వాళ్లే నానా యాగీ చేస్తున్నారని అన్నారు.

Also Read: Nellore District: డాక్టర్ కాదు రాబందు.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం.. ప్రభుత్వం సీరియస్