వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో సీఎం జగన్‌ భేటీ.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాసేపట్లో సమావేశం కానున్నారు. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో..

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో సీఎం జగన్‌ భేటీ.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Updated on: Jan 25, 2021 | 11:59 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాసేపట్లో సమావేశం కానున్నారు. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్‌ చర్చించనున్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటూ వివిధ ప్రాజెక్టులపైనా ఎంపీలతో సీఎం జగన్‌ చర్చించనున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ కూడా త్వరలో పార్లమెంటు ముందుకు రానుండటంతో ఆ అంశాలపైనా ఎంపీలతో వైఎస్ జగన్ చర్చిస్తారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరిని పథకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ భావిస్తున్నారు.

మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైందిగా వైసీపీ భావిస్తుంది. దీనిపై పార్లమెంటులో గలం విప్పాలని ఎంపీలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.