Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. త్వరలో కేబినెట్ హోదా

|

Apr 27, 2022 | 7:03 PM

ఏపీలో అధికార వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్సయ్యింది. జూలై 8న ప్లీనరీ నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. త్వరలో కేబినెట్ హోదా
Cm Jagan
Follow us on

AP news: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్సయ్యింది. జూలై 8న ప్లీనరీ నిర్వహణకు సమాయత్తమవుతోంది అధికార పార్టీ. మే 10 నుంచి గడపగడపకూ వైసీపీ(Ysrcp) కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కాగా మంత్రులు, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌(Cm jagan) సమావేశం ముగిసింది. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు సీఎం. పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు. 95 శాతం హామీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని.. మనం వేసే ప్రతి అడుగు అలెర్ట్‌గా ఉండాలన్నారు జగన్‌.

కొత్తగా జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటు..

పార్టీ మీటింగ్‌లో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు సీఎం జగన్‌. కొత్తగా జిల్లా అభివృద్ధి మండలిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులే చైర్మన్లుగా ఉంటారని స్పష్టం చేశారు. దీని ప్రకారం 26 జిల్లాలకు 26 మంది జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లు ఉండబోతున్నారు. వీరికి కేబినెట్‌ హోదా కూడా ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఆ ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేస్తామని పార్టీ నేతలకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.

ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్‌ వార్నింగ్‌

ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.  ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెడతానని క్లియర్‌గా చెప్పేశారు. రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను.. మంత్రులు కలుపుకొని వెళ్లాలి సూచించారు.  ఎవరికైనా పార్టీనే సుప్రీం అని..గెలిస్తేనే మంత్రి పదవి అని తేల్చి చెప్పారు.  గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ పరంగా 100 శాతంలో… సీఎంగా 60 శాతం తన గ్రాఫ్‌ బాగుందని, 40 శాతం మిగిలిన వాళ్లదేనని ఎమ్మెల్యేలకే చెప్పారు. ఎవరి గ్రాఫ్‌ బాగుంటే వాళ్లకే టికెట్‌ వస్తుందన్నారు.

Also Read: Vizag: డాక్టర్ కాదు కీచకుడు.. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే..