వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్‌లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది. ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే ఆరు అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినంధించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జమ్‌దానీ చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు వచ్చాయి. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా.. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం.. ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక.. సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ఏపీకి ఆరు అవార్డులు దక్కడంతో.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వాటి వివరాలు తెలియజేశారు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు. అయా విభాగాల అధికారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయా అవార్డులు అందుకున్నారు ఏపీ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..