CM Jagan: నేడు కీలకమైన నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తున్నారు. ఇందులో భాగంగా మే 10 శుక్రవారం మంగళగిరి, నగరి, కడపలో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.

CM Jagan: నేడు కీలకమైన నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Cm Jagan

Updated on: May 10, 2024 | 7:50 AM

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తున్నారు. ఇందులో భాగంగా మే 10 శుక్రవారం మంగళగిరి, నగరి, కడపలో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో కలిపి కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తన 59 నెలల పాలనల అందిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్దిని చూసి ఓటు వేయమని అడుగుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 10గంటలకు మంగళగిరిలో సీఎం జగన్‌ ప్రచారం నిర్వహించనున్నారు. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన లావణ్యకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి.

ఇక్కడ టీడీపీ నుంచి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. కావున ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఆసక్తిరేపుతోంది. మంగళగిరిలో ఎన్నికల ప్రచారం తరువాత మధ్యాహ్నం 12:30కి నగరి నియోజకవర్గం పుత్తూరులో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.30కు తన సొంత నియోజకవర్గం కడపలోని వన్ టౌన్ సర్కిల్‎లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు సీఎం జగన్‌. అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం అంజద్ బాషాను గెలిపించాల్సిందిగా కోరనున్నారు.ఈ మూడు సభలకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు. సీఎం ఆదినుంచి నిర్వహించిన ప్రతి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అడుగడుగునా జననీరాజనాలు పడుతున్నారు అభిమానులు. ఈరోజు ఈ మూడు నియోజకవర్గాల్లో పర్యటన తరువాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..