AP New Cabinet Live: కొలువుదీరిన మంత్రి వర్గం.. జగన్ కేబినెట్ 2.0లో వీరే కొత్త మంత్రులు..
CM Jagan New Cabinet 2.0 Live Updates: ఏపీలో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు నుంచి మొదలు పెట్టి విడుదల రజని వరకు మంత్రులు ప్రమాణం చేశారు.
CM Jagan New Cabinet 2.0 Live Updates: ఏపీలో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు నుంచి మొదలు పెట్టి విడుదల రజని వరకు మంత్రులు ప్రమాణం చేశారు. ముగ్గురు మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో ఇంగ్లీష్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. మిగిలిన వారంతా తెలుగులోనే చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు, గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది సీఎం జగన్ కాళ్లకు నమస్కారం చేశారు. ప్రమాణం తర్వాత కొత్త మంత్రులతో గ్రూప్ ఫొటో దిగారు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్.
ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..
Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..
LIVE NEWS & UPDATES
-
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల వివరాలు ఇవే.
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఈ టీమ్‌తోనే ఆయన ఎన్నికలకు వెళ్తారు. ఇక, శాఖల కేటాయింపే మిగిలింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదిమూలపు సురేష్ నారాయణస్వామి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బొత్స సత్యనారాయణ తానేటి వనిత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావు గుమ్మనూరు జయరాం జోగి రమేష్ సీదిరి అప్పలరాజు గుడివాడ అమర్‌నాథ్ షేక్ బేపారి అంజాద్ బాషా అంబటి రాంబాబు పినిపే విశ్వరూప్ ఉషశ్రీ చరణ్ ధర్మాన ప్రసాదరావు విడదల రజిని ఆర్.కె.రోజా మేరుగ నాగార్జున ముత్యాలనాయుడు కొట్టు సత్యనారాయణ పీడిక రాజన్నదొర దాడిశెట్టి రాజా కాకాని గోవర్దన్ రెడ్డి
-
సందడిగా 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం
ఏపీలో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు నుంచి మొదలు పెట్టి విడుదల రజని వరకు మంత్రులు ప్రమాణం చేశారు. ముగ్గురు మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో ఇంగ్లీష్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. మిగిలిన వారంతా తెలుగులోనే చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు, గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పారు.
-
-
మూడోసారి మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ 2.0 కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
-
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అను నేను..
సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2015 నుంచి కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-
ఏపీ నూతన కేబినెట్‌లోకి ఎమ్మెల్యే ఆర్కే రోజా..
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ నూతన కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2014, 2019లో నగరి నుంచి గెలుపొందింది. 2020 నుంచి ఏపిఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు.
రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. 16-11 -1972న జన్మించారు. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోజా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బిఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు.
ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు.
-
-
మంత్రిగా ఉషాశ్రీ చరణ్ ప్రమాణం
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
-
రెండో సారి మంత్రిగా నారాయణస్వామి..
డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో సారి మంత్రి పదవి దక్కింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కేబినెట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-
జగన్ 2.0 టీమ్‌లో కొట్టు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, నిరంతరం ప్రజలను వెన్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు.
-
నూతన మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. YSR సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో YSR పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ న్యూ అలుమ్‌నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.
తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు.
-
మంత్రిగా ఉషాశ్రీ చరణ్ ప్రమాణ స్వీకారం
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
-
కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..
సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2015 నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-
మంత్రిగా జోగి రమేష్ ప్రమాణ స్వీకారం..
పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
-
నూతన మంత్రిగా జగన్‌కు వీర విధేయుడు గుడివాడ అమరనాథ్..
అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014-2019 మధ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
గుడివాడ అమర్నాథ్, వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్‌కు వీర విధేయుడు. విధేయత కోటాలో అమర్నాథ్‌ను(Gudivada Amarnath) తాజాగా మంత్రి పదవి వరించింది. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా విశాఖ జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గుడివాడ అమర్నాథ్. విశాఖ జిల్లా నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా అమర్నాథ్‌కు పేరుంది. తాజాగా అయన్ను మంత్రి పదవి వరించింది(YS Jagan New Cabinet). 22 జనవరి 1985లో విశాఖపట్నం జిల్లా, అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గుడివాడ గురునాథ రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అమర్‌నాథ్ బి.టెక్ వరకు చదువుకున్నారు. గుడివాడ అమర్‌నాథ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2006లో తన 21వ ఏటలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు.
అంతేకాదు అమర్‌నాథ్ అతి పిన్న వయస్సులో విశాఖపట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశారు గుడివాడ అమర్నాథ్. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీల పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్‌గా పనిచేశారు.
గుడివాడ అమర్నాథ్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవింద సత్యనారాయణపై 8వేల 169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా, 2019లోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, కొన్ని సమీకరణాలతో, అమర్నాథ్‌కు అవకాశం రాలేదు. తాజా మంత్రివర్గంలో గుడివాడ అమర్నాథ్‌కు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. కాపు సామాజిక వర్గం, జగన్‌కు విధేయుడు కావడంతో అమర్నాథ్‌కు అవకాశం వచ్చిందని చెప్పవచ్చు.
-
మంత్రిగా కొట్టు సత్యనారాయణ ప్రమాణం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-
మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణ స్వీకారం
శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1980లో రాజకీయ ప్రవేశం చేశారు. వైఎస్సార్ కేబినెట్ రెవెన్యూ మంత్రిగా చేశారు. 2010-13 వరకు ఆర్ అండ్ బి మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 3సార్లు మంత్రిగా పనిచేశారు.
ఐదుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. సుదీర్ఘ అనుభవానికి సరైన సమయంలో గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ వైఎస్సార్ తనయుడి కేబినెట్‌లో పనిచేయాలన్న కోరిక నెరవేరిందని ఆయన ప్రకటన చేశారు.
ధర్మాన ప్రసాదరావుకు రాజాకీయ నాయకుల్లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన లోతైన విషయ పరిజ్ఞానం, విషయాన్ని సుస్పష్టంగా చెప్పగల నేర్పు, ఇరిగేషన్ అంశాలపై విశేషమైన అవగాహన, రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయన సొంతం. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా వారి ఆవేదనను కళ్లకు కట్టినట్టు ప్రసంగించే నేర్పరి కావడంతో .. స్థానికంగా ఎందరో అభిమానులు ఉన్నారు.
-
మంత్రిగా దాడిశెట్టి రాజా ప్రమాణ స్వీకారం
తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా సేవలు అందించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీ నుంచి నేడు మంత్రిగా..
2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు.
-
మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ..
కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. ఇందులో భాగంగా ఇదే జిల్లాకు చెందిన రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్‌లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు. 2001 నుంచి 2006 వరకు రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.
కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్‌లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది.
-
నూతన మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహించారు.
-
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బూడి ముత్యాలనాయుడు
మాడుగుల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంచిన బూడి ముత్యాలనాయుడు జగన్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు బలమైన బీసీ నాయకుడిగా పేరుంది.
సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే..
సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. జగన్‌తోనే ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త కేబినేట్‌లో మంత్రిగా అవకాశం కల్పించారు.
-
మూడోసారి మంత్రిగా బొత్స సత్యనారాయణ..
జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పనిచేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ కేబినెట్ 2.0లో కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
-
ఆదిమూలపు సురేష్ ప్రమాణ స్వీకారం..
జగన్ 2.0లో కొత్త మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-
నేను అంజాద్ బాషా..
మంత్రిగా అంజాద్ బాషా ప్రమాణ స్వీకారం చేశారు.
-
అందరి కంటే ముందుగా మంత్రిగా అంబటి రాంబాబు
మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. ముందుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.
-
ప్రమాణస్వీకార వేదిక వద్దకు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్
మంత్రి వర్గ ప్రమాణస్వీకార వేదిక వద్దకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ సచివాలయానికి బయలుదేరారు.
-
మంత్రిగా ప్రమాణం చెయ్యడానికి ముందు రోజా..
మంత్రిగా ప్రమాణం చెయ్యడానికి ముందు రోజా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. కుటుంబ సమేతంగా వెళ్లిన ఆమెతో పాటు అనుచరులు, అభిమానులు కూడా వచ్చారు. ఇక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. రోజాకు స్వాగతం పలికేందుకు ఆలయ ఈవో భ్రమరాంబ ఎదురెళ్లారు.
Published On - Apr 11,2022 11:22 AM