రాత్రంతా సచివాలయంలోనే సీఎం చంద్రబాబు.. మొంథా తుఫాన్‌పై మంత్రులు, అధికారులకు కీలక సూచనలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండాలని నిర్ణయించుకున్నారు.

రాత్రంతా సచివాలయంలోనే సీఎం చంద్రబాబు.. మొంథా తుఫాన్‌పై మంత్రులు, అధికారులకు కీలక సూచనలు!
CM Chandrababu Review

Updated on: Oct 28, 2025 | 9:58 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండాలని నిర్ణయించుకున్నారు. తుఫాన్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుఫాన్‌పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కీలక సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాన్ ముప్పు నుంచి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని సీఎం ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండిపడకుండా పర్యవేక్షించాలారు. ప్రతి గంటకు కలెక్టర్లు తుఫాన్ బులెటిన్లు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విజయవాడ, ఏలూరు, భీమవరంపై ఫోకస్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలన్న ముఖ్యమంత్రి, తప్పుడు వార్తలు, భయాందోళనలకు అవకాశం ఇవ్వొద్దన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..