శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

Srisailam Brahmotsavam 2026: మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం
Chandrababu

Updated on: Feb 07, 2026 | 4:16 PM

అమరావతి: మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు.

నంద్యాల జిల్లాలోని కొలువ తీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం లక్షలాది భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన ఘనంగా జరగబోయే మహా శివరాత్రి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాలలు ధరించిన భక్తులు తరలివస్తున్నారు. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.