Amaravati Meeting: మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం..

"అమరావతి.." ఐదుకోట్ల మంది ఆంధ్రులకు రాజధాని. అయితే భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అదొక "ఎమోషన్‌". చంద్రబాబు పిలుపుతో రాజధాని కోసం కేవలం 58 రోజుల వ్యవధిలోనే ఏకంగా 34 వేలకు పైగా ఎకరాల్ని భూసమీకరణలో ఇచ్చారు. 29 గ్రామాల ప్రజలు. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో..

Amaravati Meeting: మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం..
Ap Minister & Deputy Cm & CM

Updated on: May 02, 2025 | 6:16 PM

“అమరావతి..” ఐదుకోట్ల మంది ఆంధ్రులకు రాజధాని. అయితే భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అదొక “ఎమోషన్‌”. చంద్రబాబు పిలుపుతో రాజధాని కోసం కేవలం 58 రోజుల వ్యవధిలోనే ఏకంగా 34 వేలకు పైగా ఎకరాల్ని భూసమీకరణలో ఇచ్చారు. 29 గ్రామాల ప్రజలు. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో.. రాజధాని రైతులు అలుపెరగని పోరాటం చేశారు. ఏకంగా 16 వందల 31 రోజుల పాటు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగించారు. చివరికి వారి పోరాటం ఫలించింది. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ చేతుల మీదుగానే మళ్లీ గ్రాండ్‌గా రీస్టార్ట్‌ అయింది. ఈ సందర్భంగా రాజధాని రైతుల సాగించిన పోరాటాన్ని చంద్రబాబు సహా నేతలంతా ప్రశంసించారు.

ఐదేళ్లపాటు అమరావతి విధ్వంసం చూసిన రైతులు ఇకపై అభివృద్ధి చూస్తారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాలు ఇచ్చారని..వారి పోరాటం వల్లే అమరావతి నిలబడిందన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

ఐదేళ్లపాటు జరిగన ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నారు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. అమరావతికి వాళ్లు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని..ఒక రాష్ట్రానికి భవిష్యత్‌ ఇచ్చారని చెప్పారు. రాజధాని కోసం తమ భవిష్యత్తును పనంగా పెట్టిన అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది భరోసా ఇచ్చారు.

జై అమరావతి అన్నందుకు వైసీపీ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిందన్నారు..మంత్రి నారా లోకేష్‌. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేకపోయారని చెప్పారు. తగ్గేదే లేదంటూ 1631 రోజులపాటు పోరాటం చేసి అమరావతిని సాధించుకున్నారని..ఇకపై అమరావతిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.

పదేళ్ల క్రితం మోదీ చేతుల మీదుగా పురుడు పోసుకున్న అమరావతి తిరిగి ఆయన చేతులు మీదుగానే పునః ప్రారంభమవుతోందన్నారు..మంత్రి నారాయణ. రాజధాని కోసం భూములు త్యాగం చేయడమే కాకుండా..అమరావతి కోసం అలుపెరగకుండా ఐదేళ్ల పాటు పోరాటం చేసిన రైతులకు పాదాభివందనాలని చెప్పారు.