Compassionate Appointment in APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నానీ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ద్వారా వెల్లడించారు. మొత్తం 1800 లకు పైగా కారుణ్య నియామకాలు ఖాళీగా ఉన్నాయని, గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లోని ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్‌కు సంబంధించి వాహనాలకు ఆయిల్ కంపెనీల (oil companies) నుంచి నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడుతున్నమన్నారు. ఆర్టీసీ కేంద్రం నుంచి కొనే ఆయిల్ ధరల తేడాల్లో తీవ్ర మార్పులు వచ్చాయని, గతంలో 15 రూపాయలు తేడా వుండేదని, ప్రస్తుతం బయటి,బంకుల్లోనే తక్కువ దరకు ఆయిల్ దొరుకుతుందన్నారు. దీంతో బయట బంకుల్లోనే ఆయిల్ కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు, ఆ ప్రకారంగానే బయట బంకుల్లో ఆయిల్ కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకు కోటి 50 లక్షల రూపాయలు ఆదా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33.83 కోట్ల రూపాయల మిగులు చేకూరిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతామని, కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు ఆపేసిన 25 శాతం రాయితీని ఏప్రిల్ నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read: