AP Crime News: స్కూల్ లో పిల్లలతో పనిచేయించడం ఉపాధ్యాయులదే తప్పు.. మృతికి కారణమైనవారిపై…

|

Aug 26, 2021 | 2:33 PM

AP Crime News: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందిగామ మండలం అనాసాగరం జిల్లా పరిషత్ హాయ్ స్కూల్లో విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్..

AP Crime News: స్కూల్ లో పిల్లలతో పనిచేయించడం ఉపాధ్యాయులదే తప్పు.. మృతికి కారణమైనవారిపై...
Ap Crime News
Follow us on

AP Crime News: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందిగామ మండలం అనాసాగరం జిల్లా పరిషత్ హాయ్ స్కూల్లో విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కాకినాడ) ఆర్.జె.డి నరసింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంతటి దారుణానికి కారణం ఏమిటి అంటూ స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్ జేడీ సీరియస్ అయ్యారు. అంతేకాదు స్కూల్ హెడ్ మాస్టర్ పద్మావతిని సస్పెండ్ చేశారు.

అనంతరం ఇదే విషయం పై ఆర్.జె.డి నరసింహారావు స్పందిస్తూ.. స్కూల్లో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాదు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుతం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాలుడు కుటుంబంలోని ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని.. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పిల్లల చేత పనులు చేయడం ఉపాధ్యాయులదే తప్పని అన్నారు. ఈ ప్రమాద ఘటన పై రెండు రోజులలో పూర్తి విచారణ చేస్తామని తెలిపారు. నివేదిక అనంతరం దాని ఆధారంగా బాలుడు మృతికి బాధ్యులైనవారిపై తీసుకుంటామని తెలిపారు.

 

Also Read:

 కాబుల్ విమానాశ్రయం ఖాళీ చేయండి.. దాడి జరిగే ఛాన్స్ ఉంది.. వెంటనే వెళ్లిపోండి..

ఈ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో ఇబ్బందులు తప్పవంటోంది జ్యోతిష శాస్త్రం.. ఈ రాశులవారిలో మీరున్నారా? 

యూపీలో భారీ వర్షాలు..బాగ్ పట్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న కారు..డ్రైవర్ ఏం చేశాడంటే ..?