Cemetery: దహన సంస్కారాల సమయంలో వివాదం.. నడిరోడ్డుపైనే మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు..!

|

Feb 19, 2021 | 4:06 PM

Cemetery: ఓ వృద్దురాలి మృతదేహం రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. బంధువులు సైతం నడిరోడ్డుపైనే విడిచి వెళ్లడంతో..

Cemetery: దహన సంస్కారాల సమయంలో వివాదం.. నడిరోడ్డుపైనే మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు..!
Addaguduru Lockup Death Case
Follow us on

Cemetery: ఓ వృద్దురాలి మృతదేహం రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. బంధువులు సైతం నడిరోడ్డుపైనే విడిచి వెళ్లడంతో.. చివరకు దహనసంస్కారాలకు నోచుకోకుండానే మృతదేహం మార్చురీకి చేరింది. మానవత్వానికే మచ్చతెచ్చేలా మారిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మోట్టూరుగూడ గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మెట్టూరు నిర్వాసిత కాలనీకి తీసుకెళ్లారు. కాలనీ శివార్లకు తీసుకెళ్తుండగా మెట్టూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామ శ్మశానవాటికలో దహనసంస్కారాలు చేయొద్దని మెట్టూరు గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలేసి ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకున్నా ఎవరూ మాట వినలేదు. పైగా వివాదం కొనసాగుతుండగానే మృతురాలి బంధువులు మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. గ్రామస్థులకు నచ్చజెప్పి కార్యక్రమం పూర్తి చేయాల్సిన బంధువులు ఇలా వెళ్లిపోవడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు మెట్టూరు గ్రామస్తులు 108కి కాల్‌ చేసి సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. మృతదేహాన్ని కొత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

Also read:

చేసిన అప్పులు తీర్చలేక కన్నకూతుర్నే అమ్మేశాడు ఓ కసాయి తండ్రి.. ఏడాదిపాటు అమ్మాయిని బంధించి లైంగిక వేధింపులు..!

Drishyam 2 Review: ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు.. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తున్న మోహన్ లాల్ ‘దృశ్యం 2’..