Guntur Clashes: ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన పరదాపట్టా.. మిత్రుడి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన వైనం..!

|

Feb 21, 2021 | 12:01 PM

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరదా పట్టా విషయంలో ఇరువురి..

Guntur Clashes: ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన పరదాపట్టా.. మిత్రుడి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన వైనం..!
Follow us on

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరదా పట్టా విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దాంతో పవన్ అనే వ్యక్తి తన మిత్రుడైన గోపీ ఇంటికి వెళ్లి అతనిపై కత్తితో దాడి చేశాడు. అయితే, పవన్‌ను గోపీ తండ్రి, అతని బంధువులు అడ్డుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని పవన్.. గోపీ సహా అతని బంధువులపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గోపీతో పాటు అతని బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. పవన్ దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్‌పై కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also read:

కస్టమర్లకు రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. నెలకు కేవలం రూ.100తో అన్‏లిమిటెడ్ కాల్స్.. డేటా.. ఎలాగంటే..

Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..