Chandrababu Arrest: స్కిల్‌ స్కామ్‌లో మరో సంచలనం.. రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్‌ పేరు

ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నారు. ఇవాళ ఆదివారం కోర్డుకు సెలవు కావడంతో ఓపెన్‌ కోర్టులో విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఓపెన్‌ కోర్డులో విచారణ తప్పనిసరిగ కాదని న్యాయమూర్తి తెలిపారు. ఇదే అంశంపై న్యాయమూర్తి కాసేపట్లో దేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్..

Chandrababu Arrest: స్కిల్‌ స్కామ్‌లో మరో సంచలనం.. రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్‌ పేరు
Ap Skill Development

Updated on: Sep 10, 2023 | 8:32 AM

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కోర్డుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించారు. అసలు స్కిల్‌ స్కామ్‌ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అని సీఐడీ తెలిపింది. ఇక రిమాండ్‌ రిపోర్ట్‌లో చంద్రబాబు తనయుడు లోకేష్‌ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. కిలారి రాజేశ్‌ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని సీఐడీ తెలిపింది. అలాగే చంద్రబాబు పీఎ శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నారు. ఇవాళ ఆదివారం కోర్డుకు సెలవు కావడంతో ఓపెన్‌ కోర్టులో విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఓపెన్‌ కోర్డులో విచారణ తప్పనిసరిగ కాదని న్యాయమూర్తి తెలిపారు. ఇదే అంశంపై న్యాయమూర్తి కాసేపట్లో దేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కుట్ర జరిగిందని సీఐడీ చెబుతోంది.

జైలా.. బెయిలా.?

కాగా చంద్రబాబుకు బెయిల్‌ రానుందా.? లేదా.? అన్నది కాసేపట్లో తేలనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో హోరాహోరీ వాదనలు సాగుతున్నాయి. చంద్రబాబుతరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తుండగా.. సీఐడీ న్యాయవాదులు వివేకా చారి, వెంకటేష్ హాజరయ్యారు. ఇక సీఐడీ రిపోర్ట్‌లో చంద్రబాబు నేరపూరితకుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, చట్టాన్ని పట్టించుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రజాధనాన్నిరక్షించాల్సిన వారే మోసాలకు పాల్పడ్డారంటూ, ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారని ఆరోపించారు. మోసాలకు పాల్పడేందుకు ఫోర్జరీ కూడా చేశారన్న సీఐడీ, తప్పుడు డాక్యుమెంట్లను నిజమైన వాటిగా చూపించారన్నారు. చంద్రబాబు నేరానికి ప్రేరేపించారన్న సీఐడీ, తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..