తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జన సేన కార్యకర్త చెంప పగల గొట్టిన సిఐ అంజు యాదవ్ పై చర్యలకు రంగం సిద్ధమైంది. పోలీసు అధికారి గా ఆమె వింత ప్రవర్తన ఇప్పుడు చర్చగా మారింది. ఖాకీ యూనిఫామ్ లో హుందా గా వ్యవహరించ కుండా విమర్శలు మూట కట్టుకున్న అంజూ యాదవ్ తీరు ను తప్పు పట్టడానికి రేపు ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో బాధితులు జనం పట్ల విచారణ పేరుతో చేసిన అంజూ ఇంట్రాగేషన్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హెచ్ఆర్సీ నోటీసుల తలనొప్పి ఒకవైపు మరోవైపు పోలీస్ బాస్ ల శాఖ పరమైన చర్యలు మరోవైపు అంజు యాదవ్ ను చుట్టుముట్టాయి.
తిరుపతి ఎస్పీ నుంచి అనంతపురం రేంజ్ డిఐజి కి నివేదిక వెళ్లగా రాష్ట్ర డిజిపి కి కూడా ఈ మొత్తం వ్యవహారంపై రిపోర్టు అందింది. ఇప్పటికే సెలవు లో ఉన్న సిఐ అంజుయాదవ్ పై చర్యలు ఉండే అవకాశం ఉంది. ఛార్జ్ మెమో కూడా జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు రేపు పవన్ కళ్యాణ్ వచ్చేలోపే సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలా లేదంటే పవన్ తిరుపతి ఎస్పీని కలిసి ఏం డిమాండ్ చేస్తారో వేచి చూసి నిర్ణయం తీసుకోవాలా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఇప్పటికే విధి నిర్వహణలో ఎన్నోసార్లు వివాదాలు, పలు కేసుల విచారణ విషయంలో చార్జి మెమోలు, ఎంక్వయిరీలను ఎదుర్కొన్న సిఐ అంజూ యాదవ్ ఇప్పుడు మరోసారి చెంపదెబ్బతో వార్తల్లో నిలిచింది. శ్రీకాళహస్తి సిఐగా జనసేన కార్యకర్త చెంప దెబ్బ ఇష్యూతో ఎలాంటి పనిష్మెంట్ కు గురి అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఏపీ హెచ్ ఆర్ సీ కూడా ఈ ఇష్యూ ని సీరియస్ గా తీసుకోవడంతో లీవ్ లో ఉన్న
అంజూ యాదవ్ పై తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..