Krishna District: విషాదం.. ఆడుకుంటూ నీటిలో పడ్డ 10 మంది చిన్నారులు..

|

Aug 04, 2021 | 3:25 PM

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.  కృష్ణానది ఒడ్డున చోటు...

Krishna District: విషాదం.. ఆడుకుంటూ నీటిలో పడ్డ 10 మంది చిన్నారులు..
Crime News
Follow us on

-పడవ బోల్తా ఘటనలో గల్లంతైన బాలుడు….

-కృష్ణానది ఒడ్డున ఆడుకోవడానికి వెళ్ళిన 10 మంది పిల్లలు..

– నీటి ప్రవాహానికి ఒక పక్కకు పడవ ఒరగడంతో నదిలో పడిపోయిన పిల్లలు..

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.  కృష్ణానది ఒడ్డున చోటు చేసుకున్న పడవ ప్రమాద ఘటనలో 4 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామ పంచాయతీ అధికారులు పోలీసులకు, స్థానిక రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. పడవలో మొత్తం 10 ఉండగా 9 మందిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతు అయిన బాలుడు కోసం అన్వేషణ కొనసాగుతోంది. కాగా పిల్లలు పడవ పైకి ఎక్కి ఆడుకుంటూ ఉండగా.. అది పక్కకు ఒరగడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ఘటనపై విచారణ ప్రారంభించిన అధికారులు నదిలో బాలుడు కోసం గాలిస్తున్నారు.

జున్ను తిని 15 మందికి అస్వస్థత

విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడికి చెందిన ఓ రైతు ఆవు జున్నును తన బంధువులైన మాడుగుల మండలం డి.సురవరం పంపించారు. ఏమైందో.. ఏమో కానీ ఆ జున్ను తిన్న వారు తీవ్ర అస్వస్థతకు గురై..వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. వారందరిని మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కి తరలించారు. మెడికల్ ఆఫీసర్ సూర్య ప్రకాశ్, వైద్య సిబ్బంది తక్షణమే బాధితులకు వైద్య పరీక్షలు జరిపారు. చికిత్స అనంతరం బాధితులు ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడ్డారని డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు చిన్న పిల్లలున్నారని వెల్లడించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన బంగారు కొండకు భాగ్యనగరంలో గ్రాండ్‌ వెల్‌కమ్

2021 బ్యాచ్ విద్యార్థులు ఆ ఉద్యోగానికి అనర్హులు.. హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటనపై దుమారం