Child dies in Guntur: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిందెలో ఎలుక పడిన నీటిని తాగి.. అస్వస్థతకు గురైన ఓ చిన్నారి మరణించాడు. ఈ విషాద ఘటన గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాగునీటి బిందెలో ఎలుక పడి చనిపోయింది. ఆ నీరు కలుషతమైంది. అది చూసుకోకుండా.. చిన్నారి ఉసర్తి ప్రభు దివ్య తేజ (6) ఆ నీటిని తాగాడు. తేజ నీరు తాగిన అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. ఏకధాటిగా వాంతులయ్యాయి.
ఈ క్రమంలో బిందెలో ఎలుకపడి చనిపోయినట్లు గమనించిన కుటుంబ సభ్యులు.. తేజను వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న తేజ సోమవారం మృతి చెందాడు.
మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చిన్నారి మరణించడంతో తల్లీదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..