CM Jagan: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌

|

Feb 15, 2022 | 12:22 PM

ఏపీలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తోంది ఏపీ సర్కార్‌. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. రైతులకు 542.06 కోట్ల ఇన్‌పుట్‌..

CM Jagan: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌
Disbursing Input Subsidy Fo
Follow us on

ఏపీలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తోంది ఏపీ సర్కార్‌. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(Chief Minister Jaganmohan Reddy). రైతులకు 542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని(Input Subsidy) విడుదల చేశారు. ఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద.. 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు. గ‌తేడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈమేర‌కు సీఎం జగన్‌మోహ‌న్‌రెడ్డి రేపు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదును జమ చేశారు. 5,71,478 మంది రైతుల ఖాతాల్లోకి రూ.543.77 కోట్లను, అలాగే, 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను అందజేశారు. ఈ రెండు పథకాలకు మొత్తం రూ.564.28 కోట్లను జమచేశారు.

ఇవి కూడా చదవండి: Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..

Skin Care Tips: బాదం నూనె ఉపయోగిస్తే నిత్య యవ్వనం.. ముడుతలు లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!