CM Jagan: పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్ స్టేషన్లు.. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం..

|

Feb 14, 2023 | 3:19 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్​స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు..

CM Jagan: పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్ స్టేషన్లు.. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం..
Cm Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్​స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పోలీస్​స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దిశ యాప్​ను రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షలకు పైన మహిళలు డౌన్​లోడ్ చేసుకున్నారన్న ముఖ్యమంత్రి జగన్.. దిశ యాప్​లో ఫిర్యాదు చేస్తే 5 సెకన్ల లోపు రిప్లై ఇస్తున్నామని, 5-10 నిమిషాల సమయంలోనే ఘటనా స్థలానికి వెళ్తున్నామని వెల్లడించారు.

గ్రామస్థాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశాం. వారి ద్వారా కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. టూరిస్టు పోలీసు స్టేషన్లలో కియాస్క్​లు ఏర్పాటు చేశాం. కియోస్క్​లపై టెలిఫోన్ నెంబర్​అందుబాటులో ఉంచుతాం. దిశ యాప్​ను ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలనే విషయాలను తెలిపేందుకు కరపత్రాలు సిద్ధం చేశాం. వీటిని టూరిస్టు పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచుతాం.

      – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ సమయంలో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో భద్రతకు భరోసా ఇస్తూ టూరిస్టు పోలీసు స్టేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేశారు. టూరిస్టు పోలీసు స్టేషన్లలో సిబ్బంది అంకిత భావం, సేవాభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ..