CM Jagan: బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు సీఎం జగన్ దీవెనలు.. ముఖ్యమంత్రితో ఇంగ్లీష్‌లో ముచ్చటించిన చిన్నారులు

|

May 19, 2022 | 5:24 PM

కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు..

CM Jagan: బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు సీఎం జగన్ దీవెనలు.. ముఖ్యమంత్రితో ఇంగ్లీష్‌లో ముచ్చటించిన చిన్నారులు
Bendapudi Zp High School St
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలోని బెంగపూడి విద్యార్థుల ప్రతిభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ఫిదా అయ్యారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ తరహాలో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో.. ఆయన స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు. గురువారం బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. వాళ్లతో సీఎం జగన్‌ సంభాషణ దాదాపుగా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు సీఎం జగన్‌. మేఘన అనే స్టూడెంట్‌ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది విద్యార్థి. అందులో నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్‌. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది.

ఇదిలావుంటే.. బెండపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యం ఇప్పుడు దేశ విదేశాల్లోకింది. బెండపూడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.. ఓ మారుమూల గ్రామంలోని పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు ఏకాంగా అమెరికా విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడడంతో.. బెంగపూడి విద్యార్థులు, టీచర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఇది సీఎం జగన్‌ దృష్టికి కూడా వెళ్లడంతో.. వారికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.


ఇదిలావుంటే ఏపీ సర్కార్ బడుల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ మీడియానికి కూడా ప్రవేశపెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నారు. ఇక, స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం అనే 100 రోజుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5 నుంచి 10వ క్లాస్‌ వరకు విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలపై పట్టు ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. దీనికి బెండపూడిలో జీవీఎస్‌ ప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలు జోడించారు.

ఇవి కూడా చదవండి