Chicken Cost: ఇప్పటికే తెలంగాణా(Telangana)లో చికెన్ ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వంతు వచ్చింది.. ఇక్కడ కూడా కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వాస్తవానికి ఎప్పుడైనా సరే… వేసవి కాలం వస్తే.. చికెన్ ధరలు దిగి వస్తాయి. ఎండలు పెరుగుతున్న సమయంలో బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో సర్వసాధారణంగా వేసవిలో చికెన్ ధర తగ్గుతుంది. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా వేసవి మొదలు కాగానే.. చికెన్ ధర అమాంతం పైకి పైకి పోతుంది. వారం రోజుల క్రితం వరకు స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 లు ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు, స్కిన్ లెస్ రూ.300 లకు అమ్ముతున్నారు. అమాంతం పెరిగిన ధరలతో వినియోగదారులు కోడి కూర కొనాలంటే.. ఆలోచిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు తమ వ్యాపారం మందగించిందని వాపోతున్నారు. కోడి మేత ధరలు విపరీతంగా పెరగడంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయని .. తమ వ్యాపారం అంతంతమాత్రంగా సాగుతుందని అంటున్నారు.
సాధారణ రోజుల్లో వినియోగించే లక్షకిల్లో ఉంటె.. ఆదివారం, ఇతర పండగ రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయి.
అయితే ఈ వేసవిలో చికెన్ ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. కోడి ధర పెరిగినా తాము నష్టాలు పొందుతున్నామని పౌల్ట్రీ రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణం చూపుతూ.. మేత ధర పెరిగిందని అంటున్నారు. అందుకనే కోడి ధర పెంచాల్సి వస్తుందని చెబుతున్నారు రైతులు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
Also Read: కొనసాగుతున్న జై భీమ్ వివాదం..చిక్కుల్లో హీరో సూర్య.. ఈటీ రిలీజ్‌ని అడ్డుకుంటామంటున్న పీఎంకే నేతలు