
చికెన్ ధరలు భారీగా డౌన్ అయ్యాయి. గత నెలలో ఏకంగా రూ.340కి చేరుకోగా.. ఇప్పుడు ఒకేసారి భారీ మొత్తంలో పడిపోయాయి. శ్రావణ మాసం రావడంతో చాలామంది మాంసానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణంతో సరఫరా ఎక్కువగా ఉండగా.. డిమాండ్ తక్కువగా ఉంది. డిమాండ్ తక్కువగా ఉండటంతోనే ధరలు తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. దీని వల్ల చికెన్ దుకాణాలకు కస్టమర్లు లేక ఆదాయం తగ్గుతుంది. శ్రావణ మాసం కావడంతో కస్టమర్లు తగ్గిపోయారని వ్యాపారులు చెబుతున్నారు. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
-హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.222గా పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.197గా ఉంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.100గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.127 వద్ద కొనసాగుతోంది.
-ఆంధ్రప్రదేశ్‌లో ధరలను చూస్తే.. విజయవాడలో కిలో స్కిన్ లెస్ రూ.240 వద్ద లభిస్తుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.212 పలుకుతోంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.110గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 వద్ద కొనసాగుతోంది.
-కరీంనగర్ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.222, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.100 వద్ద కొనసాగుతోంది.
కోడి గ్రుడ్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.75గా ఉంది. ఇక హైదరాబాద్, కరీంనగర్ జోన్‌లో 12 గుడ్ల ధర రూ.74గా ఉంది. గత నెలలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కొ గుడ్డు ధర రూ.8కి చేరుకుంది. కానీ ఇప్పుడు ఒక్కొ గుడ్డు రూ.6 పలుకుతోంది. ఇక గత నెలలో చికెన్ ధరలు రూ.350కి చేరుకోగా.. ఇప్పుడు రూ.220కి పడిపోయాయి. ఏకంగా రూ.100కిపైగా తగ్గి ఊరటనిచ్చింది. రానున్న కొద్ది రోజుల పాటు చికెన్, కోడి గుడ్ల ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. శ్రావణ మాసం రావడంతో చికెన్, కోడి గుడ్లకు డిమాండ్ తగ్గినట్లు చెబుతున్నారు. మరోవైపు షుగర్, ఉల్లిపాయలు ధరలు పెరుగుతున్నారు. కిలో ఉల్లి రూ.60కి చేరుకుంది. కేజీ పంచదార రూ.60కి చేరుకుంది. ఇక నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుల నెత్తి బండ పడినట్లయింది.