విశాఖ ఆర్కే బీచ్‌లో భక్తిశ్రద్ధలతో ఛాత్ పూజలు నిర్వహించారు. బీహార్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన ప్రజలు ఈ పూజలో పాల్గొన్నారు. మహిళలు ఉపవాస దీక్ష చేసి పూజలు చేశారు. సముద్రపు నీటిలో నిలబడి పూజలు చేశారు. సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పించారు. 36 గంటల దీక్షను మహిళలు విరమించారు.అన్ని శక్తులకు మూలమైన సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించే నాలుగు రోజుల వేడుకలను ఛాత్ పూజలు అని అంటారు. ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ఛాత్ పూజలను జరుపుకుంటారు.
సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. ఛాత్ అంటే ఆరు.. కార్తీక మాసం ఆరవ రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కఠినమైన ఉపవాస దీక్షతో నదిలో జలాశయాల్లో స్నానాలు చేయడం.. నీటిలో నిలబడి సూర్యునికి ఎదురుగా పూజలు చేస్తూ సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఛాత్ పండుగ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. డ్రై ఫ్రూట్స్, బియ్యం, తాజా ఫలాలు, గోధుమలు, కొబ్బరి, బెల్లం, నెయ్యి వంటి వాటి తయారీకి వినియోగిస్తారు. తేకువ అనేది గోధుమ పిండితో చేసిన కుకీ. ఇది ఒక ప్రసిద్ధ వంటకం. దీన్ని భక్తులు ఇష్టపడి తింటూ ఉంటారు.