Chennai: గంజాయ్ అనుకుని దాడి చేసిన పోలీసులకు షాక్.. ఆ మూటలను విప్పి చూడగా..!

|

Jun 24, 2022 | 9:34 AM

Chennai: గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం అందుకుని రైడింగ్ చేసిన పోలీసులకు బిత్తరపోయే సీన్ కనిపించింది.

Chennai: గంజాయ్ అనుకుని దాడి చేసిన పోలీసులకు షాక్.. ఆ మూటలను విప్పి చూడగా..!
Police
Follow us on

Chennai: గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం అందుకుని రైడింగ్ చేసిన పోలీసులకు బిత్తరపోయే సీన్ కనిపించింది. అనుకున్నది ఒకటైతే.. అంతకు మించిన దందా జరుగుతుందని గుర్తించి షాక్ అయ్యారు పోలీసులు. అవును, గంజాయ్ రవాణా జరుగుతోందని దాడులు చేసిన పోలీసులకు.. భారీ స్థాయిలో హవాలా సొమ్ము పట్టుబడింది. చెన్నై నగరంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఆంధ్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అధికారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. ఆంధ్రా నుంచి అధిక మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. చెన్నై శివార్లలోని మనడి దగ్గర తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ తనిఖీలో ఆంధ్రాలోని ఒంగోలు నుంచి వచ్చిన కారులో వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో.. కారును పక్కకు ఆపారు. కారును చెక్ చేయగా.. భారీగా హవాలా నగదును గుర్తించారు పోలీసులు. దాదాపు 2 కోట్ల రూపాయలు నగదును అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. కారులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఐటీ శాకకు సమాచారం అందించారు పోలీసులు. ఒంగోలు నుంచి వచ్చిన జయశంకర్, నారాయణన్‌‌తో పాటు.. స్వాధీనం చేసుకున్న డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..