Chandrababu Interrogation: ఆ మూడు గంటలు ఏం జరిగింది..? చంద్రబాబుకు లంచ్ బ్రేక్.. నెక్స్ట్ ఏంటంటే..?

|

Sep 23, 2023 | 1:24 PM

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణ కొనసాగుతోంది. రెండు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్ట్‌.. కొన్ని షరతులు పెట్టడంటో దాని ప్రకారం సీఐడీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని కోర్ట్ ఆదేశించడంతో.. ఉదయం 9:30 నుంచి విచారణను ప్రారంభించారు.

Chandrababu Interrogation: ఆ మూడు గంటలు ఏం జరిగింది..? చంద్రబాబుకు లంచ్ బ్రేక్.. నెక్స్ట్ ఏంటంటే..?
Chandrababu
Follow us on

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణ కొనసాగుతోంది. రెండు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్ట్‌.. కొన్ని షరతులు పెట్టడంటో దాని ప్రకారం సీఐడీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని కోర్ట్ ఆదేశించడంతో.. ఉదయం 9:30 నుంచి విచారణను ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల వరకు సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. మొదటగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు విచారణను ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకు.. 3 గంటలపాటు సుధీర్ఘ విచారణ జరిగింది. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబుకు కోర్టు అనుమతి ప్రకారం కుటుంబసభ్యులు ఇంటి నుంచి భోజనం తీసుకువచ్చారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతోంది. 2 గంటల అనంతరం చంద్రబాబును సీఐడీ అధికారులు మరలా ప్రశ్నించనున్నారు. ఐదు గంటల వరకు విచారణ జరగనుంది. ఉదయం సెషన్ లో గంటకు ఇద్దరు చొప్పున అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. స్కిల్ స్కామ్, సంతకాలు, నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. చంద్రబాబు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతించారు అధికారులు. 9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతించారు. ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం. కస్టడీకి తీసుకునే ముందు.. తర్వాత బాబుకు వైద్య పరీక్షలు చేయనున్నారు. అయితే, న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇస్తున్నారు. చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు సైతం హాజరయ్యారు. బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు కల్పించారు. విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని.. అంతే కాకుండా, దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలని.. సీల్డ్ కవర్లో కాపీని కోర్ట్‌కు సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాట్లతో చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు విచారణ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు కూడా సెంట్రల్ జైలు ప్రాంతానికి చేరుకున్నారు. లోకేష్ క్యాంప్‌నకు చేరుకుంటున్న టీడీపీ నేతలు.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శిస్తున్నారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..