Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే పని మొదలు పెట్టారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబు. వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందనీ, మళ్లీ పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే యువతతోపాటు తటస్థులు పార్టీలో చేరాలని, మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
కింది స్థాయిలో నిజమైన కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారని, అలాంటి వారికి గుర్తింపు ఇస్తామని చెప్పారు చంద్రబాబు. ఇదే సమయంలో సీనియర్లపై అసహనం వ్యక్తం చేశారాయన. సీనియార్టీ ఉండి ఓట్లు వేయించలేకపోతే ఎలా అని సీనియర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే కంటిన్యూ అయితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందన్నారు. కాబట్టే సిన్సియార్టీని గుర్తిస్తామని, సీనియార్టీకి గౌరవం ఇస్తామని చెప్పారు. ఇక ఈ ఏడాది మహానాడును ఒక రోజే నిర్వహించాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు. ఇంకోరోజు జనరల్ బాడీ సమావేశం ఉంటుందన్నారు. మహానాడు తర్వాత నుంచి ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు టీడీపీ అధినేత.
Also read:
AP Weather Alert: మండుటెండల్లో చల్లని కబురు.. ఆ ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు..
Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..
Saudi King: హాలీవుడ్ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ ప్రకటించిన సౌదీ రాజు.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?