Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కొత్త కాన్వాయ్ చూశారా.. వీడియో

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తారు. ఉదయం11 గంటల 27 నిమిషాలకు కేసరపల్లి IT పార్క్ దగ్గర ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇందుకోసం 10.40కి ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాత్రం, జేపీ నడ్డా, చిరంజీవి తదితర ప్రముఖులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు.

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కొత్త కాన్వాయ్ చూశారా.. వీడియో
Chandrababu

Edited By:

Updated on: Jun 12, 2024 | 11:34 AM

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తారు. ఉదయం11 గంటల 27 నిమిషాలకు కేసరపల్లి IT పార్క్ దగ్గర ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇందుకోసం 10.40కి ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాత్రం, జేపీ నడ్డా, చిరంజీవి తదితర ప్రముఖులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు తరలివస్తున్నారు. కేసరపల్లి సభా ప్రాంగణం అభిమాన సందోహంతో కిటకిటలాడుతోంది. తరలివస్తున్న కూటమి కార్యకర్తలతో ఇప్పటికీ బెజవాడలో ట్రాఫిక్‌ జామ్‌ కనిపిస్తోంది.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. 10:40 కు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్ లో చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి స్వాగతం పలికిన తర్వాత ఇద్దరూ కలిసి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

చంద్రబాబు కొత్త కాన్వాయ్ వీడియో చూడండి..

అనంతరం ప్రమాణ స్వీకారం జరగనుంది. సీఎంగా చంద్రబాబు అనంతరం పవన్ కల్యాణ్.. ప్రమాణం చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..