Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు లాంచ్.. ప్రతీఒక్కరికీ అమలు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా త్వరలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ఏర్ాటు చేసింది. డ్వాక్రా మహిళలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడనున్నాయి.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు లాంచ్.. ప్రతీఒక్కరికీ అమలు..
Andhra Pradesh

Updated on: Feb 17, 2026 | 9:44 AM

డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కూటమి సర్కార్ తోడ్పాటు అందిస్తోంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు అనేక ప్రోత్సహకాలు అందిస్తోంది. అలాగే వీరు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సుదుపాయం కల్పిస్తోంది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళల కోసం త్వరలో మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం వస్తుంది. ఈ సందర్భంగా రెండు పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. అసలు ఈ పథకాలు ఏంటి..? మహిళలకు ఎలాంటి లబ్ది జరగనుంది? అనే విషయాలు ఒకసారి చూద్దాం.

పావలా వడ్డీకే రుణాలు

డ్వాక్రా మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రభుత్వం మార్చి 3న ప్రారంభించనుంది. ఆ రోజు మహిళా దినోత్సవం కాకుండా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతుంది. దీనిని పురష్కరించుకుని ఈ పథకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకాల్లో భాగంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని పిల్లల చదువులు, వివాహాలకు స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. కేవలం పావలా వడ్డీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. వీటిని ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. 48 వాయిదాల్లో వీటిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ పొందేందుకు పెద్దగా డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. పెళ్లికి లోన్ పొందేందుకు కేవలం లగ్న పత్రిక,  పెళ్లి ఖర్చు అంచనాను సమర్పిస్తే సరిపోతుంది. అనంతరం వెంటనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. ఈ రెండు పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అర్హులు ఎవరంటే..?

ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు అయి ఉండాలి. ఇక కనీసం ఆరు నెలల పాటు డ్వాక్రా గ్రూపులో సభ్యురాలుగా కొనసాగి ఉండాలి. అలాగే బయోమెట్రిక్ డీటైల్స్ ఆధారంగా ఈ పథకాలు అమలు చేస్తారు. మార్చి 3న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకాలు ప్రారంభం కానున్నాయి. గతంలోనే ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ప్రక్రియ నిలిపివేశారు. ఇప్పుడు మహిళా దినోత్సవం వస్తుండటంతో.. ఆ రోజు ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో లాంచ్ చేస్తున్నారు. అటు డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది.

Follow Us