CBN Arrest: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. గురువారం ములాఖత్‌కి బాలయ్య, పవన్‌

Chandrababu Naidu Arrest: హౌస్ రిమాండ్ ఇవ్వాలని పదే పదే కోర్టుకి విఙ్ఞప్తి చేశారు. అయితే లూథ్రా చెప్పిన వాదనల్ని పరిగణనలోకి తీసుకోని ఏసీబీ జడ్జ్‌.. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే లూథ్రా చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ ట్వీట్‌లో కామెంట్ చేశారు. 

CBN Arrest: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. గురువారం ములాఖత్‌కి బాలయ్య, పవన్‌
Chandrababu

Updated on: Sep 13, 2023 | 10:34 PM

అడ్వకేట్ సిద్దార్థ్ లూథ్రా.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్‌తో ఒక్కసారిగా బ్యానర్ ఐటమ్‌గా మారిపోయారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని కోర్టులో వాదించారాయన. హౌస్ రిమాండ్ ఇవ్వాలని పదే పదే కోర్టుకి విఙ్ఞప్తి చేశారు. అయితే లూథ్రా చెప్పిన వాదనల్ని పరిగణనలోకి తీసుకోని ఏసీబీ జడ్జ్‌.. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే లూథ్రా చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ ట్వీట్‌లో కామెంట్ చేశారు.

పోరాటం చేయడం కూడా సరైన చర్యే అవుతుందని ట్వీట్‌లో కోట్‌ చేశారు. ఈ కామెంట్లపై స్పందించారు ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌. తన దగ్గరకు వస్తే అన్ని అధారాలిస్తామన్నారాయన. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించలేదు. జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ACB కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ చంద్రబాబు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసులో వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు బాబు అరెస్టుపై గవర్నర్‌ అనుమతి కావాల్సిందేనని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే ఈ కేసులో CIDని కౌంటర్‌ దాఖలు చేయనివ్వాలని సూచించారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని CID తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి కోరారు. సీఐడీ కౌంటర్‌ దాఖలు తర్వాతే పూర్తి వాదనలు వింటామని చెప్పి చంద్రబాబు పిటిషన్‌ విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు ఈ నెల 18 వరకు చేపట్టవద్దని ACB కోర్టును హైకోర్టు ఆదేశించింది.

ఇదిలావుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అన్యాయం.. అక్రమం అంటూ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ ఎదుట ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వందలమంది ఉద్యోగులు ఐ యామ్ విత్ సీబీఎన్‌ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేశారు.

ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం