ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా నూజువీడులో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండేదనని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ప్లాంట్‌కు తాము ఎప్పుడో భూమిపూజ చేశామని, ఈ ప్రభుత్వం వాటికి మళ్లీ చేస్తోందని విమర్శించారు. తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామికవాడను పూర్తి చేసి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని కాపాడుకునేందుకు ప్రజలు క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పోలీసులు త్యాగానికి మారుపేరని, కానీ కొందరి తీరువల్లే వారి ప్రతిష్ఠ మసకబారుతోందని చంద్రబాబు అన్నారు. పోలీసులు ఇప్పుడు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన పోలీసులను వదిలిపెటే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ రుణం తీర్చుకునేందుకే కోడికత్తి డ్రామా ఆడానని, సానుభూతి వస్తే ఓట్లు, సీట్లు పెరుగుతాయని అలా చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడని పేర్కొన్నాడు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తిరుపతి పింక్ డైమండ్‌ను తానే కాజేశానని అన్నారని, అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్లు కూడా లేవని తెలంగాణ నేతలు ఎద్దేవా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..