Polavaram: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి ఊరట..! పొరుగు రాష్ట్రాలవి అపోహలేనన్న కేంద్ర జల శక్తి సంఘం

|

Sep 29, 2022 | 9:53 PM

పోలవరం ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలకు చెక్ పడినట్టేనా...? బ్యాక్ వాటర్ విషయంలో కేంద్ర జలశక్తి సంఘం సమావేశంలో జరిగిన చర్చేంటి..? ఏపీ పొరుగు రాష్ట్రాలు తెలిపిన అభ్యంతరాలేంటి..? దానికి జల శక్తి సంఘం అధికారులు చెప్పిన సమాధానమేంటి?

Polavaram: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి ఊరట..! పొరుగు రాష్ట్రాలవి అపోహలేనన్న కేంద్ర జల శక్తి సంఘం
Polavaram
Follow us on

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి ఊరట? ప్రాజెక్టు ముంపుపై పొరుగు రాష్ట్రాలవి అపోహలేనన్న కేంద్ర జల శక్తి సంఘం. ఏపీ వాదనతో ఏకీభవించిన అధికారులు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రస్తుతానికి ఊరట లభించినట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టు ముంపు విషయంలో పొరుగు రాష్ట్రాలవి అపోహలేనని కేంద్ర జల శక్తి సంఘం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పోల‌వ‌రంపై ఉన్న అభ్యంత‌రాల‌పై సుప్రీంకోర్టు ఆదేశాల‌తో కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఓ స‌మావేశం ఏర్పాటుచేసింది. వ‌ర్చువ‌ల్ గా జరిగిన స‌మావేశానికి ఏపీ, తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌ఢ్, ఒరిస్సా రాష్ట్రాల అధికారులు హాజ‌ర‌య్యారు. ప్రాజెక్ట్ పై ఏపీ మిన‌హా మిగిలిన రాష్ట్రాలు అనేక అభ్యంత‌రాలు వ్యక్తం చేసాయి.

మరోవైపు ఏపీ కూడా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని అధికారులకు వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అధికారులు ఏపీ వాదనతో ఏకీభవించినట్లు సమాచారం. 2009,2011లలో 2 సార్లు శాస్త్రీయ అధ్యయనం చేశామన్న జల శక్తి సంఘం.

అంతే కాదు.. ఇప్పటికే ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ విషయంలో 2009, 2011 సంవత్సరాలలో 2 సార్లు శాస్త్రీయంగా అధ్యయనం చేశామని మూడు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి సంఘం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ముంపు విషయంలో తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు అనవసరంగా అపోహలకు గురవుతున్నాయని ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 3 రాష్ట్రాలలో ముంపు సమస్యే ఉండే ప్రసక్తే లేదని జల శక్తి సంఘం అధికారులు పేరొన్నట్లు సమాచారం.

అక్టోబర్ 7 సాంకేతిక అంశాలపై మరో సారి మీటింగ్

ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనప్పటికీ ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేద‌ని జల శక్తి సంఘం అధికారులు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి ట్రిబ్యునల్ సిఫార్సుల మేరకు 36 లక్షల వరద నీరు వెళ్లేలా స్పిల్ వే కట్టాలని ఉన్నప్పటికీ…. ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు పూర్తి అవుతున్నట్టు మూడు రాష్ట్రాల‌కు తెలిపారు.

బ్యాక్ వాటర్ సర్వే కు సంబధించిన సాంకేతిక అంశాల పై అక్టోబర్ 7 తేదీన నాలుగు రాష్ట్రాల ఈ ఎన్ సి లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తాజా స‌మావేశం ద్వారా పోల‌వ‌రంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుల నుంచి మార్గం సుగ‌మం అవుతుంద‌ని ఏపీ అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం