Andhra Pradesh: రిషికొండలో నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం స్పందన.. కీలక గైడ్‌లైన్స్ జారీ..

విశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గైడ్‌లైన్స్‌ జారీ చేసింది కేంద్రం. కేవలం, 9.88 ఎకరాల్లో మాత్రమే అభివృద్ధికి

Andhra Pradesh: రిషికొండలో నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం స్పందన.. కీలక గైడ్‌లైన్స్ జారీ..
Rishikonda

Updated on: Dec 23, 2022 | 4:57 AM

విశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గైడ్‌లైన్స్‌ జారీ చేసింది కేంద్రం. కేవలం, 9.88 ఎకరాల్లో మాత్రమే అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. అంతకుమించి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది కేంద్రం. చట్టప్రకారం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రిషికొండలో ఉల్లంఘనలను ఉపేక్షించే ప్రసక్తే లేదంది కేంద్రం. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందన్నారు సెంట్రల్‌ మినిస్టర్‌ అశ్వినీకుమార్‌. రిషికొండ తవ్వకాలపై సభ్యుల ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి. ఉల్లంఘనలు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిషికొండలో తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్వినీకుమార్‌.

ఇదిలాఉండగా.. రాజధాని పేరుతో విశాఖలోని రిషికొండను ధ్వంస చేస్తున్నారని, విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారని ప్రకృతి ప్రేమికులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో ఇటు కోర్టుల్లో, అటు కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తాజాగా పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని ఎంపీలు ప్రస్తావించిగా.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రిషికొండ విషయంలో ఎలాంటి తప్పులను ఉపేక్షించబోమంటూ తేల్చి చెప్పింది కేంద్రం. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో ఈ అంశంపై చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..