Visakhapatnam Metro: ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ కాగా.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలియజేశారు.

Visakhapatnam Metro: ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
Centre Approves Visakhapatnam Metro Project

Updated on: Feb 10, 2026 | 3:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు కోసం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ మెట్రోకు ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీ పర్యటను వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయిన సందర్భంగా కేంద్రమంత్రి సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది.

Chandrababu Naidu Meets Amit Shah

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ తోనూ సిఎం సమావేశం అయ్యారు. కేంద్రమంత్రులతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

Chandrababu Naidu Meets Nirmala Sitharaman

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.