AP News: ‘కేజీబీ’లో భారీగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు.. యావత్ దేశానికే శుభవార్త.. పూర్తి వివరాలు..

ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు.. మొత్తంగా దేశానికి శుభవార్త. కేజీఎఫ్‌ను తలదన్నేలా కృష్ణ-గోదావరి బేసిన్(కేజీబీ)లో నిక్షేపాలు బయటపడ్డాయి. క్రిష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి మొదలైంది. ''బదాయి భారత్‌.. ONGC జీతేగాతో భారత్‌ జీతేగా..'' ఇది కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆనందభరిత ట్వీట్‌.

AP News: కేజీబీలో భారీగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు.. యావత్ దేశానికే శుభవార్త.. పూర్తి వివరాలు..
Ongc

Updated on: Jan 09, 2024 | 12:16 PM

ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు.. మొత్తంగా దేశానికి శుభవార్త. కేజీఎఫ్‌ను తలదన్నేలా కృష్ణ-గోదావరి బేసిన్(కేజీబీ)లో నిక్షేపాలు బయటపడ్డాయి. క్రిష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి మొదలైంది.

”బదాయి భారత్‌.. ONGC జీతేగాతో భారత్‌ జీతేగా..” ఇది కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆనందభరిత ట్వీట్‌. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ ఆర్ధికంగా దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేస్తూ ONGC ఫోటోలను ట్యాగ్‌ చేశారాయన.

ఎస్‌.. ONGCలో మహద్భుతం..

కాకినాడ తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్‌ బంగాళాఖాతం ‘డీప్‌ సీ’ ప్రాజెక్ట్‌ నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని ప్రకటించారు హర్దీప్‌ సింగ్‌. కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2 బ్లాక్‌లోని క్లస్టర్‌-2 ప్రాజెక్ట్‌ నుంచి తొలిసారిగా ఎక్సాట్రాషన్‌ మొదలైందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2016లో ప్రారంభమైంది. కాకినాడ తీరంలో చమురు నిక్షేపాలున్నట్టు గుర్తించారు.ఆ ఏరియాను మూడు క్లస్టర్లుగా విభజించారు. 2021లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి వున్నా కోవిడ్‌ కారణంగా ఆపరేషన్స్‌ ఆలస్యమయ్యాయి. ఇక్కడున్న 26 బావుల్లో నాలుగింటిలో ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి. అర్మడ స్టెర్లింగ్‌-V అనే ‘ఫ్లోటింగ్‌ వెసెల్‌తో సముద్రగర్భం నుంచి చమురును వెలికి తీస్తోంది ONGC. ప్రస్తుతం కేజీ-DWN 98 బ్లాక్‌లోని క్లస్టర్‌-2 ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి మొదలైంది. రోజుకు 45వేల బ్యారెల్స్‌ క్రూడ్ ఆయిల్‌, 10 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. తాజా నిల్వలతో దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తి 7 ఏడు శాతం.. సహజవాయువు ఉత్పత్తి 7శాతం పెరుగుతుందన్నారు మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి.

కాకినాడ తీరం.. క్రిష్ణా -గోదావరి బేసిన్‌ పరిధిలోని రెండో క్లస్టర్‌లో ప్రస్తుతం చమురు, సహజవాయువుల ఉత్పత్తి ప్రారంభమైంది. నిర్మాణంలో మూడో క్లస్టర్‌ మూడు నెలల్లో పూర్తి కావచ్చు. సహజ ఇంధన వనరులు ఇలా సమకూరితే.. భారత ఆర్ధిక వ్యవస్థ దిశా.. దిశ ఇక మరో లెవల్‌ అంటున్నారు బిజినెస్ విశ్లేషకులు. కృష్ణా గోదావరి బేసిన్‌లో ముడి చమురు ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ట్వీట్‌ను ట్యాగ్ చేసిన ఆయన.. ట్విట్టర్ ద్వారా ఓఎన్‌జీసీకి అభినందనలు తెలిపారు. భారత్‌కు ఇది కీలకమైన ముందడుగు అని.. దేశ స్వావలంభన మిషన్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు.