Andhra Pradesh: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే.. మొత్తం ఎన్ని అంటే..

New Medical Colleges: ఐదు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కొత్త కాలేజీలకు..

Andhra Pradesh: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే.. మొత్తం ఎన్ని అంటే..
New Medical Colleges

Updated on: Jun 09, 2023 | 9:47 AM

ఆంధ్రప్రదేశ్‌పై మరోసారి వరాల జల్లు కురిపించింది మోదీ సర్కార్. తాజాగా ఐదు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కొత్త కాలేజీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మెడికల్ సీట్లు భారీగాపెరగనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో తరగతులు మొదలుకానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. ఇవీ కూడా ప్రైవేటు యాజమాన్యం కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబ‌ర్ నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో త‌ర‌గ‌తులు ప్రారంభించాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ.8500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్త కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అద‌నంగా రానున్నాయి. రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్యనభ్యసించే అవకాశం ఈ కాలేజీల ద్వారా దొరుకుతుంది. రానున్న రెండు , మూడేళ్లలో ద‌శలవారీగా మిగిలిన 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం