మదనపల్లి, జూలై 20: దేశ వ్యాప్తంగా టమాటా ధర చుక్కలను తాకుతుంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ టమాటా పంటకు కావాలా పెట్టుకుంటున్నారు. సీసీకెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. టమాటా ధరలు గణనీయంగా పెరగడంతో కేంద్ర బృందం ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లి మార్కెట్ లో పర్యటించింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో టమోటా పంట స్థితిగతులను పరిశీలించటానికి వచ్చిన కేంద్రం బృందం మదనపల్లి టమాటా మార్కెట్ పరిశీలించింది. రైతాంగం విస్తారంగా సాగు చేస్తున్న టమాటా పంట స్థితిగతులపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఈ కేంద్ర బృందంలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు రైతులను టమాటా సాగు మార్కెటింగ్ లో మెళకువలను, అవకాశాలను అడిగి తెలుసుకుంది. సీజన్ల వారీగా దిగుబడి పై వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర బృందం రైతులు, వ్యాపారులు హార్టికల్చర్, మార్కెటింగ్ అధికారులతో సమావేశం అయ్యింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..