UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..

|

Aug 04, 2021 | 5:35 PM

రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఇందులో 28 రూట్లలో విమాన సర్వీసులు...

UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..
Udan Yojana
Follow us on

విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు ప్రధాన కారణం. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్‌) పథకంలో భాగంగా విమానయాన కంపెనీలు చిన్న చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అలాగే టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉంటున్నాయి. రూ.1,000లోపు ఇప్పుడు కొన్ని మార్గాల్లో విమాన ప్రయాణం చేయొచ్చు.

తాజాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఇందులో 28 రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా విమానయానాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 40 విమాన మార్గాలను గుర్తించినట్టు కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత ఏపీలో 40 ‘ఉడాన్’ రూట్లను గుర్తించామని చెప్పారు. వీటిలో 28 రూట్లలో ఇప్పటికే విమాన సర్వీసులు ప్రారంభమై, కొనసాగుతున్నాయని తెలిపారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయని వివరించారు.

ఈ నగరాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్‌దల్‌పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా రూట్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి వివరించారు.

కర్నూలు ఎయిర్ పోర్టు…

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. కర్నూలులో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రల సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాదు, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, కర్నూలు లోనూ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుండడంతో కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి: IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..

Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..