పరమేశ్వర్ రెడ్డిని టీడీపీలో చేర్పించాలనుకున్నాం: బీటెక్ రవి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా భావిస్తోన్న పరమేశ్వర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ రెడ్డికి, వివేకాకు సత్సంబంధాలు లేవని బీటెక్ రవి అన్నారు. తన చిన్నాన్నకు చంపిన కేసులో పరమేశ్వర్ రెడ్డి నిందితుడని, 15ఏళ్లుగా అతడితో తమకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని తెలిపారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్యవర్తిత్వంతో పరమేశ్వర్ రెడ్డిని టీడీపీలో చేర్పించాలనుకున్నామని పేర్కొన్నారు. ఆదినారాయణ రెడ్డి ట్రాప్ చేసి హత్య చేయించారనడం తప్పు […]

పరమేశ్వర్ రెడ్డిని టీడీపీలో చేర్పించాలనుకున్నాం: బీటెక్ రవి

Edited By:

Updated on: Mar 18, 2019 | 3:04 PM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా భావిస్తోన్న పరమేశ్వర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ రెడ్డికి, వివేకాకు సత్సంబంధాలు లేవని బీటెక్ రవి అన్నారు. తన చిన్నాన్నకు చంపిన కేసులో పరమేశ్వర్ రెడ్డి నిందితుడని, 15ఏళ్లుగా అతడితో తమకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని తెలిపారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్యవర్తిత్వంతో పరమేశ్వర్ రెడ్డిని టీడీపీలో చేర్పించాలనుకున్నామని పేర్కొన్నారు. ఆదినారాయణ రెడ్డి ట్రాప్ చేసి హత్య చేయించారనడం తప్పు అని అసలు నిందితులు ఎవరో పోలీసులే తేలుస్తారని వివరించారు. ఈ కేసుతో సంబంధం ఉంటే పరమేశ్వర్ రెడ్డిని ఎవరూ కాపాడలేరని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌కు కేవీపీ ఎలాగో, వివేకాకు గంగిరెడ్డి అలా అంటారని.. కేసును తప్పుదోవ పట్టించేందుకు వైఎస్ కుటుంబసభ్యులు యత్నిస్తున్నాని ఆరోపించారు.